30-10-2025 12:35:53 AM
కీసర , అక్టోబరు 29(విజయక్రాంతి ): కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల అభివృద్ధి పనుల కోసం ఆలయ ఛైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఆలయ ఈవో కట్ట సుధాకర్ రెడ్డి బుదవారం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట ఆలయ పరిసర ప్రాంతంలో గల నందీశ్వరుడు దగ్గర నుంచి తామరకొలను వరకు రోడ్డు విస్తరణ పనుల అభివృద్ధి కొరకు, ఆలయ పశ్చిమ గోపురం తూర్పు గోపురం దగ్గర సిసి రోడ్డు గురించి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మగారు ఆలయ ఈవో కట్ట సుధాకర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డిని కలిసి వినతిపత్రం అదజేశారు మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.