30-10-2025 12:34:41 AM
మణికొండ, అక్టోబర్ 29, (విజయక్రాంతి) : మణికొండ రాజకీయా ల్లో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మణికొండ పంచాయతీ మాజీ వార్డు సభ్యురాలు సముద్రాల వాణి, ముత్తారం గ్రామ మాజీ సర్పంచ్ సముద్రాల రమేశ్ బీఆర్‌ఎస్ లో చేరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలనా దక్షత, కేటీఆర్ పనితీరుకు ఆకర్షితులై, వారిని ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్టు వారు తెలిపారు.
స్థానికంగా పట్లొల్ల కార్తీక్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అభ్యుదయ భావాలు గల సామాజిక సేవకుడిగా రమేశ్కు, మాజీ ప్రజాప్రతినిధిగా వాణికి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరూ బీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరించిన విషయాన్ని పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఒక ప్రకటనలో తెలియజేశారు. వీరి చేరికతో మణికొండలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.