calender_icon.png 30 October, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం నిరాకరించిన రైస్ మిల్ యాజమాన్యం

30-10-2025 12:36:18 AM

రైస్ మిల్ ముందు రైతుల నిరసన

కొల్చారం, అక్టోబర్ 29 :కొల్చారం మం డల కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్ వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. పోతిరెడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు తీసుకువచ్చిన రవా ణా లారీని రైస్మిల్ యాజమాన్యం దిగుమతి చేయమంటూ అడ్డుకోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కేటాయించిన రైస్మిల్కే ధాన్యం బస్తాలు తీసుకొ చ్చామని, నిరాకరిస్తే మేమేం చేయాలి అం టూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికే వర్షాలు రైతులకు ఆందోళనకు గురిచే స్తున్నాయని, మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను రెండు రోజులుగా రోడ్డుపై నిలిపివే యడంతో ధాన్యం తడిసి నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయం కొల్చారం మండల వ్యవసాయ అధికారికి, తహసిల్దార్ కు జిల్లా పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకుంటే పెద్ద ఎత్తున రైతులను తీసుకొచ్చి ఆందోళన చేయనున్నట్లు తెలిపారు.