28 June, 2026 | 2:55 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

13-05-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, మే 12 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖ అధికారుల ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 107 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు,  అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

కాగా భు సమస్యలు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, %ఖిగీళి%, తదితర శాఖలకు సంబంధించి అర్జీలను స్వీకరించి ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణి లో వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.