13-05-2025 12:00:00 AM
ఇద్దరు నిందితులు అరెస్టు
ఎక్సైజ్‌శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి వెల్లడి
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి) : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. ఉప్పల్, మల్లాపూర్ ప్రాంతంలోని హెచ్‌సీఎల్ ప్రాంతం లోని ఓ గోదాంలో రూ.53 లక్షల విలువైన 106 కిలోల గంజాయిని అబ్కారీ శాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సుజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉప్ప ల్‌లోని హెచ్‌సీఎల్‌లో ఒక గో దాంలో నిందితులు గంజాయి నిల్వ చేశారనే పక్కా సమాచారంతో గంజాయి సీజ్ చేశామని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని తెలిపారు.
106 కేజీల గంజాయిని 56 ప్యాకె ట్లలో నిందితులు ప్యాక్ చేశారని తెలిపారు. ఈ కేసులో కట్ల వివేక్ రెడ్డి, మధు కిరణ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. వివేక్‌రెడ్డి ప్రైవేట్ ఇంజనీరి ంగ్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారని ఎక్సుజ్ జాయింట్ కమిషనర్ ఖురే షి చెప్పారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారం తో మేరకు మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెంది న రాంబాబును ప్రధాన నిందితుడిగా గుర్తించామని ఖురేషి తెలిపారు.
రాంబాబు పరా రీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నామన్నారు. రాంబాబు ఓడిశా మల్కన్‌గిరి నుంచి నిందితులకు గంజాయి పంపుతారని, కట్ల వివేక్‌రెడ్డి, మధు కిరణ్ ఈ గంజాయిని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చేర వేస్తారని, తాను పంపిన గంజాయి స్టాక్ ను క్లియర్ చేసినందుకుగాను రాంబాబు ఇద్దరు నిందితులకు రూ.50 వేలు ఇస్తాడని ఎక్సుజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు.
రాంబాబును ఇంకా అదుపులోకి తీ సుకోలేదని, ఆయనను విచారించిన తర్వాత కీలక సమాచారం వెలుగులోకి వస్తుందన్నా రు. వివేక్‌పై ఇప్పటికే రెండు కేసులు ఉన్నాయని, రాంబాబుపై భద్రాచలంలో రెండు కేసులు ఉన్నాయని ఖురేషి వివరించారు.
మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు వివిధ మార్గాల్లో గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల ము ఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, అక్రమ రవాణాపై దాడులు కొనసాగుతాయన్నారు.