28 June, 2026 | 1:58 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే

13-05-2025 12:00 AM

మాజీ మంత్రి కేటీఆర్

ముషీరాబాద్, మే 12 (విజయక్రాంతి): తెలంగాణలో రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి బీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం  ముషీరాబాద్ కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు కేటీఆర్ ను కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...

రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య వంతులను చేసి బీఆర్‌ఎస్ కు మద్దతు ఇచ్చేలా పనిచేయాలన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రజని కాంత్ గౌడ్, ముప్పిడి నర్సింగ్ రావు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.