12 May, 2026 | 11:46 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

పెట్రోల్, డీజిల్ నో స్టాక్

25-04-2026 02:03 AM

ఇబ్బందుల్లో వాహనదారులు బ్లాక్ లో అమ్మకాల జోరు 

కేసముద్రం, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణ పరిధిలోని మూడు పెట్రోల్ పంపులు, కల్వల పరిధిలోని ఒక పెట్రోల్ పంపులో శుక్రవారం డీజిల్, పెట్రోల్ నో స్టాక్ బోర్డు పెట్టారు. దీనితో వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. హెచ్ పీ, భారత్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులు డీజిల్, పెట్రోల్ స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.

అయితే సందట్లో సడే మియా అన్నచందంగా కొందరు ముందుగానే అక్రమంగా పెట్రోల్, డీజిల్ స్టాక్ చేసి అధిక ధరలకు విక్రయించి వాహనదారుల జేబులకు చిల్లులు పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలియం సంస్థలు రిటైలర్ పెట్రోల్ పంపు లకు డిమాండ్ కు తగ్గట్టు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయకపోవడం వల్లే కొరతకు కారణమైందని పలు పెట్రోల్ పంపులు యజమానులు పేర్కొన్నారు.

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ పంపుల్లో ఒక్కసారిగా స్టాక్ లేకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, బ్లాక్ మార్కెట్ లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.