25 April, 2026 | 3:37 AM

రెడ్డి సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి

25-04-2026 02:02 AM
  1. రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి 
  2. చంపాపేటలో తెలంగాణ రెడ్డి సంఘం కేంద్ర కార్యాలయం ప్రారంభం 

ఎల్బీనగర్, ఏప్రిల్ 24 : తెలంగాణలోని రెడ్డి సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రెడ్డి సంఘం అడ్ హక్ కమిటీ చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో రెడ్ల సంక్షేమం కోసం చంపాపేటలో శుక్రవారం జిట్టా యాదవ్ రెడ్డి భవన్ లో తెలంగాణ రెడ్డి సంఘం కేంద్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి రామ్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని సంఘాలు ఏకతాటి దిగి రావడం ఒకే సంఘం ఏర్పాటు చేయటం శుభ సూచకమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ పాలకవర్గాన్ని కూడా నియమిస్తారని  ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్డి వర్గానికి చెందిన నిరుపేద విద్యార్థులు  తమ అవసరాలను కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తే తమ వంతుగా చేయూతనిస్తామని అడ్ హక్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్డి లందరూ ఒకటే రెడ్డి సంగం ఒక్కటే అనే నినాదంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న జిల్లా మరియు మండల స్థాయి గ్రామస్థాయి సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు కొట్టం మధుసూదన్ రెడ్డి నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్నేపల్లి లింగారెడ్డి, మడప కిరణ్ కుమార్ రెడ్డి, ముఖ్య సలహా దారులు బొక్క భూపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, బొబ్బిలి దామోదర్ రెడ్డి, పిట్ట శ్రీనివాస్ రెడ్డి నల్ల సంజీవ రెడ్డి, కో కన్వీనర్లు గంగుల శ్రీలతారెడ్డి, నూకల పద్మారెడ్డి, నందికొండ గీతారెడ్డి, దేవిరెడ్డి విజితా రెడ్డి, సభ్యులు మేక సోమి రెడ్డి, రణధీర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.