calender_icon.png 17 January, 2026 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్మికులకు పీఎఫ్ డబ్బులు జమ చేయాలి

17-01-2026 04:42:37 PM

సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

కామారెడ్డి,(విజయక్రాంతి): మున్సిపల్ కార్మికుల పీఎఫ్ డబ్బులు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం మీదట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ... తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు.

మున్సిపల్ కార్మికులకు గత రెండు సంవత్సరాలుగా పిఎఫ్, డబ్బులు తక్షణమే కార్మికుల ఖాతలో జమ చేయాలని, ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ, ఐడి కార్డు నెంబర్లు ఇవ్వాలని, కామారెడ్డి పట్టణంలో ఈఎస్ఐ హాస్పిటల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, అనారోగ్యంతో మరణించిన, ప్రమాదాల్లో మరణించిన  60 సంవత్సరాలు నిండిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు.పిఎఫ్ ఈఎస్ఐ సోమవారం వరకు కార్మికుల ఖాతాలో డబ్బులు చెల్లించాలని లేనియెడల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని మెరుపు సమ్మెకు పిలుపునిస్తామని అన్నారు.