17-01-2026 04:39:23 PM
రమావత్ సింధు నాయక్..
తాండూరు,(విజయక్రాంతి): గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్, లింకులను వెంటనే స్పందించకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ మోసాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని మ్యాజిక్ బస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రమావత్ సింధు నాయక్ అన్నారు. శనివారం ఆమె వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం కందనెల్లి తండాలో సైబర్ నేరాలపై సామాజిక అవగాహన, సైబర్ మోసాల భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడం, అనుమానాస్పద కాల్స్, సందేశాలను గుర్తించడం, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్‌ను జాగ్రత్తగా ఉపయోగించడం వంటి అంశాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ వ్యవస్థ పై పూర్తి అవగాహన, చైతన్యం కలిగి ఉండాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కందని తండా కు చెందిన యువతీ, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు