19 March, 2026 | 3:48 AM

సారా అలీ ఖాన్‌కు షాక్!

19-03-2026 12:28 AM

కేదార్‌నాథ్ వెళ్లాలంటే అఫడవిట్ సమర్పించాల్సిందే..

డెహ్రాడూన్, మార్చి 18: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై ‘బద్రీ-కేదార్ ఆలయ కమిటీ’ (బీకేటీసీ) కీలక నిర్ణ యం తీసుకుంది. బద్రీనాథ్ , కేదార్‌నాథ్‌లో ప్రార్థనలు చేయడానికి, హిందూయేతర సందర్శకులు హిందూ మతంపై తమ విశ్వాసాన్ని ధృవీకరిస్తూ ఒక అఫిడవిట్‌ను సమర్పించాలనే కొత్త నిబంధనను బద్రీ-కేదార్ ఆలయ కమిటీ ప్రవేశపెట్టింది.

కేదార్‌నాథ్‌ను తరచుగా సందర్శించే నటి సారా అలీ ఖాన్ తో సహా, హిందూయేతర భక్తులందరికీ ఈ ఆదేశం వర్తిస్తుంది. సనాతన ధర్మంపై విశ్వా సం ఉన్నట్లు అఫిడవిట్ ఇస్తేనే సారా అలీ ఖాన్‌కు దర్శనం కల్పించనున్నారు. బద్రీ-కేదా ర్ ఆలయ కమిటీ జారీ చేసిన తాజా ఆదేశం ప్రకారం, ప్రఖ్యాతి గాంచిన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలలో ప్రార్థనలు కొనసాగించ డానికి నటి సారా అలీ ఖాన్ అఫిడవిట్ సమర్పించాల్సి రావచ్చు.

మంగళవారం మీడి యాతో ‘బద్రీ-కేదార్ ఆలయ కమిటీ’చైర్మన్ హేమంత్ ద్వివేది మాట్లాడుతూ కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో దర్శనం కోరుకునే హిందూయేతర సందర్శకులందరూ ఇకపై హిందూ మతంపై తమ విశ్వాసాన్ని ధృవీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుం దని తెలిపారు. సందర్శకులు హిందూ మతంపై తమకున్న విశ్వాసాన్ని తెలిపే పత్రాలతో కూడిన రుజువును తప్పనిసరిగా సమ ర్పించాలని ఆయన మరింత స్పష్టం చేశారు.

ప్రార్థనల కోసం ఈ రెండు ఆలయాలలో దేనికైనా వచ్చే హిందూయేతర భక్తులందరికీ ఈ నియమం ఏకరీతిగా వర్తిస్తుంది. సారా అలీ ఖాన్ తరచుగా కేదార్‌నాథ్‌న్‌ను సందర్శించడాన్ని ప్రస్తావిస్తూ, ఆమె కొత్త నిబంధ నను పాటిస్తే ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తామని ద్వివేది అన్నారు. సారా అలీ ఖాన్ సనాతన ధర్మం పట్ల తన భక్తిని వ్యక్తం చేసి, అఫిడవిట్ సమర్పిస్తే, మేము ఆమెను ప్రార్థనలు చేయడానికి అనుమతిస్తాం, అని ఆయన అన్నారు.

తోటి నటి సారా అలీ ఖా న్ హిమాలయ పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు వచ్చిన వార్తలపై నెలకొన్న వివాదంపై, నటి-రాజకీయవేత్త కంగనా రనౌత్ మంగళవారం స్పందిస్తూ, ‘నిజం చెప్పడంలో‘ ఎటు వంటి సంకోచం ఉండకూడదని నొక్కి చెప్పా రు. సబ్ సనాతనీ హైం... యహాన్ జో భీ హైం సనాతనీ హైం... వో భీ సనాతనీ హై (అందరూ సనారాణిలే, ఇక్కడ ఉన్నవారంతా సనాతనీలే, వారు కూడా సనాతనీలే), కాబట్టి నిజాన్ని రాసేందుకు భయమెందుకు అని రనౌత్ బుధవారం పార్లమెంటు వెలుపల విలేకరులతో అన్నారు.