15 April, 2026 | 10:29 AM

‘మేడ్ ఇన్ ఇండియా’గా తెరపైకి ఫాల్కే జీవితం

25-05-2025 12:00 AM

భారతదేశ స్వాతంత్య్ర పోరాట నేపథ్యం, భారతీయ సినిమాకు పడిన పునాదుల మేళవింపుగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ రూపొందనుంది. ‘మేడ్ ఇన్ ఇండియా’ టైటిల్ పరిశీలనలో ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ ఫాల్కే పాత్రను పోషించనున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆమిర్ ఖానే ఫాల్కేగా నటిస్తారని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ శ్రీకృష్ణ ఈ ప్రాజెక్టు విషయమై స్పందించటంతో ఓ క్లారిటీ వచ్చింది.  

ఆమిర్ హిరాణీ టీమ్ మూడేళ్లుగా తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే భార్య సరస్వతీబాయి ఫాల్కే పాత్రకు విద్యాబాలన్‌ను తీసుకోవాలన్న అభిప్రాయాన్ని ఆమిర్ తనతో పంచుకున్నారని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి ఆమిర్ ‘సితారే జమీన్ పర్’ తర్వాత ఈ బయోపిక్ కోసం సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది.