9 June, 2026 | 12:07 PM

అనురాగ్‌లో ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్

09-06-2026 11:04 AM

ఘట్ కేసర్,(విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వరకు అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ సహకారంతో ఎమర్జింగ్ రోల్స్ అండ్ స్ట్రాటజిక్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇన్ నేచురల్ ప్రొడక్ట్స్ డ్రగ్ డిస్కవరీ అంశంపై అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ ప్రాయోజిత ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌డీపీ)  నిర్వహించబడుతోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపిటిఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మిలింద్ జన్రావ్ ఉమేకర్ మాట్లాడుతూ ఫైటోకాన్స్టిట్యుయెంట్ల వేర్పరచడం, గుర్తింపు ప్రొఫైలింగ్‌లో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

అలాగే ఏపిటిఐ సభ్యత్వం పెరుగుతున్న నేపథ్యంలో సభ్యులు సంఘం నుంచి పొందేదానికంటే సంఘ అభివృద్ధికి తాము అందించగల సేవలపై దృష్టి పెట్టాలని సూచించారు. గౌరవ అతిథి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ ఎం. వెంకటరమణ మాట్లాడుతూ ఔషధ ఆవిష్కరణ అభివృద్ధి ప్రక్రియల్లో ఏఐ వినియోగం ఖచ్చితత్వాన్ని పెంచి, సమయం వ్యయాన్ని తగ్గిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యక్షులు జి.పుల్లారెడ్డి, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ బి.మాధవరెడ్డి, డీన్ డాక్టర్ వసుధా భక్షి ప్రసంగించారు. కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ జి. బాబా శంకర్ రావు, సహ-కన్వీనర్ డాక్టర్ రామ్ మోహన్ పాల్గొన్నారు.