9 June, 2026 | 12:09 PM

నూతన వైద్యాధికారిగా డాక్టర్ కె. కృష్ణ

09-06-2026 11:07 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): వైద్యఆరోగ్య శాఖలో జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేసిన డాక్టర్ కె. కృష్ణ నాగర్ కర్నూల్ జిల్లా నూతన వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పేర్కొన్నారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.