29-07-2025 02:27:40 AM
వైద్యాధికారులకు కలెక్టర్ హరిచందన సూచన
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): వర్షాలు అధికంగా కురుస్తున్నందున సీజనల్ వ్యా ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాస రి వైద్యాధికాలను ఆదేశించారు. సోమవారం అమీర్‌పేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పేషంట్లకు సమయానికి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని సూపరింటెండెంట్ యం.కె రౌఫ్‌కు సూచించారు.
అలాగే పోస్ట్ ఆపరేషన్ వార్డు ను పరిశీలించి తల్లి బిడ్డలకు అందుతున్న వైద్య సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు. జవహర్‌నగర్ ఖైరతాబాద్ నుంచి ప్రమాద స్థితిలో వచ్చి న గర్భిణికి అత్యవసర సేవలు అందించి తల్లి బిడ్డను రక్షించిన వైద్య బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ఆస్పత్రి లో ఏమైనా చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే సత్వరమే చేపట్టాలని ఆదేశించారు. ఆమెవెంట వైద్యాధికారులు ఉన్నారు.