9 July, 2026 | 2:56 AM

పుట్టినరోజు సందర్భంగా ‘మా వృద్ధాశ్రమం’లో దాతృత్వ సేవలు

09-07-2026 01:33 AM

వృద్ధ్దులకు దుప్పట్లు పంపిణీ..

గంభీరావుపేట జులై 8 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని మా అభాగ్యుల వృద్ధాశ్రమంలో ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమం నిర్వహించారు. చికోడు గ్రామానికి చెందిన కరెడ్ల తిరుమల రెడ్డి దంపతుల కుమారుడు నవీన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అవసరమైన సామగ్రిని అందజేస్తూ దాతృత్వాన్ని చాటుకున్నారు. వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, టవెల్లు, ప్లేట్లు, గ్లాసులు,పండ్లను పంపిణీ చేశారు.

అనంతరం వృద్ధుల ఆశీర్వాదాలు తీసుకుని వారి ఆరోగ్యం, యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు మల్లు గారి నర్సాగౌడ్ మాట్లాడుతూ, పుట్టినరోజులను ఆడంబరంగా జరుపుకోవడం కంటే సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ, చికోడు గ్రామ సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు, మాజీ ఉపసర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపిటిసి లక్ష్మణ్, వార్డు సభ్యుడు పెద్ద వెంకటస్వామి,పాల్గొన్నారు.