calender_icon.png 18 November, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమన్న సేవలో మణిపూర్ అదనపు కలెక్టర్

18-11-2025 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 17 (విజయక్రాంతి): జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి వారిని విద్యామారి శ్రీధర్ ఐఏఎస్ , మణిపూర్ సబ్ కలెక్టర్, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారిని ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఆలయ విశేషాలను వివరించారు.ఏఈఓ గోవిందుల అశోక్ కుమార్, పర్యవేక్షకులు రాజేందర్, శ్రీకాంతా చార్యులు, జూనియర్ అసిస్టెంట్ సింహచారి ,తదితర ఆలయ సిబ్బంది ఉన్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన ఐఏఎస్ అధికారి కుటుంబ సమేతంగా స్వామివారి తీర్థ ప్రసాదాలుస్వీకరించారు.