16 March, 2026 | 11:38 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

అంగవైకల్యం విద్యార్థులకు ఫిజియోథెరపీ

11-11-2025 12:00 AM

ఎల్లారెడ్డి,  నవంబర్ 10 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న భవిత సెంటర్లో సోమవారం ఫిజియోథెరపీ వైద్యులు అరుణ్ 8 మంది విద్యార్థులకు అంగవైకల్యం చెందిన పిల్లలకు వ్యాయామం నిర్వహించారు. 8 మంది పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అంగవైకల్యం చెందిన వారికి పలు విధాలుగా వ్యాయామం నిర్వహించి వారి తల్లిదండ్రులకు వారం రోజులపాటు వైద్యులు సూచించిన మేరకు వ్యాయామం నిర్వహించాలని వైద్యులు అంగవైకల్యం చెందిన విద్యార్థులు తల్లిదండ్రులకు తెలిపారు.

వారానికి ఒకసారి నిర్వహించే ఫిజియోథెరపీ ద్వారా ఎంతో మంది పిల్లలకు ఆరోగ్యం సమకూరుతుందని ఫిజియో తెరపి సెంటర్ కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు వైద్యులు చేస్తున్న వ్యాయామం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంగవైకల్యం చెందిన పిల్లలు వారంకోసారి నిర్వహించే భవిత సెంటర్ కు రావాలని వైద్యుల అరుణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో, ఫిజియోథెరపీ, ఐ ఈ ఆర్ పి, శివకుమార్, వెంకటేశం,సిబ్బంది పద్మ, అంగవైకల్యం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొన్నారు.