హజ్ యాత్రలో 550 మంది యాత్రికులు మృతి
19-06-2024 11:21 AM
జెరూసలేం: ఈ సంవత్సరం హజ్ సమయంలో కనీసం 550 మంది యాత్రికులు మరణించారని దౌత్యవేత్తలు వెల్లడించారు. మృతుల్లో ఈజిఫ్టుకు చెందినవారే 300కు పైగా ఉన్నట్లు తెలిపారు. తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే మృతికి కారణమని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే హజ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని అంచనా వేస్తున్నారు. మక్కాలో అతిపెద్ద వాటిలో ఒకటైన అల్-ముయిసెమ్‌లోని శవాగారంలో మొత్తం 550 మంది ఉన్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు.






