పిల్లలమర్రి పిలుస్తోంది!
- ఆసియాలోనే రెండో అతిపెద్దది
- 700 ఏండ్ల ఘన చరిత్ర
- చెదల బారిన మహా వృక్షం
- ఎర్రమట్టితో వైద్య సేవలు
- జీవం పోసుకున్న ఊడలు
- ఊపందుకున్న టూరిజం
మహబూబ్‌నగర్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద వృక్షం మన పిల్లలమర్రి. శతాబ్దాల నుంచి పర్యాటకులను పలకరిస్తోన్న మహా మర్రి వృక్షం. ఇప్పటివరకు దాని ప్రధాన కాడ ఎక్కడ ఉందో కనిపెట్టకపోవడమే ఈ పిల్లలమర్రి ప్రత్యేకత. మూడున్నర ఎకరాల్లో విస్తరించి, దాదాపు 700 సంవత్సరాల ఘన చరిత్ర దీని సొంతం. 2018 డిసెంబర్ నెల లో పిల్లలమర్రికి చెందిన రెండు ప్రధాన ఊడలు కుప్పకూలిపోవడంతోపాటు చెదల బారిన పడింది.
సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఓ కొమ్మ నేలకొరిగింది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు పిల్లలమర్రికి ప్రాణం పోయడానికి ప్రత్యేక చికిత్స లు అందించారు. దీంతో మళ్లీ చిగురించి జీవం పోసుకుంది. దీంతో కొద్దికాలం పాటు మహావృక్షాన్ని చూసేందుకు ఎతైన ర్యాం పును నిర్మించి అక్కడి నుంచే సందర్శకులు చూసేలా చర్యలు తీసుకున్నారు. నాటి నుం చి నేటి వరకు మహబూబ్‌నగర్ (పాలమూరు)కు ప్రత్యేక గుర్తింపును తీసుకురావ డంలో పిల్లలమర్రిది ప్రత్యేక స్థానం.
ఆహ్లాదకర వాతావారణం..
పిల్లలమర్రి దగ్గర ప్రశాంతమైన వాతావారణంతోపాటు పాలపిట్టల సవ్వడులు, మూగజీవాల స్వర ధనులు, పచ్చని ఆకులు, పూలవనంతో పాటు ఆహ్లాదకరంగా ఉం టుంది. ఇక్కడే ప్రశాంతంగా మరింత సమ యం గడపాలని అనిపించేలా చేస్తోంది పిల్లలమర్రి. చిన్నారులను ఆకర్షించేలా మ్యూజి యం, ఆక్వేరియం, పార్కు ఉన్నాయి. ఒకేసా రి వందల మంది కూర్చోవడానికి నీడనిచ్చే శక్తి పిల్లలమర్రికి సొంతం.
పర్యాటకుల సందర్శన..
ఉమ్మడి పాలమూరు జిల్లాకు పిల్లలమర్రి ఓ ప్రత్యేకతను తీసుకొచ్చింది. పర్యాటక శాఖ అధికారులు ఇటీవల పిల్లలమర్రి సందర్శనను తిరిగి ప్రారంభించడంతో పర్యాటకు ల తాకిడి పెరుగుతోంది. మహావృక్షాన్ని తాకకుండా ఉండడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశా రు. కేవలం చెట్టు నీడలో నడిచేలా చూస్తున్నారు. మహారాష్ట్ర, కర్టాటక, తమిళనాడు, కేరళతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి న పర్యాటకులు దీన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహబూబ్‌నగర్‌తోపాటు చుట్టు పక్కల వివిధ సంస్థలలో విధులు నిర్వహిస్తున్న వారు సైతం ఏదైనా సమావేశాలు పిల్లలమర్రి వద్ద ఏర్పాటు చేసుకునేవారు.
ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే వారు. గతంలో పలు ప్రభుత్వ కార్యాలయా ల సమావేశాలు సైతం పిల్లలమర్రిలో జరిగి న సందర్భాలు ఉన్నాయి. రోజూ వేలాది మంది పర్యాటకులు పిల్లలమర్రిని సందర్శించే వారు. ఆదివారం అయితే ఈ సంఖ్య మరింత అధికంగా ఉండేది. ఇటీవల తిరిగి దానికి ప్రాణం పోయడంతో ఇప్పుడిప్పుడే తిరిగి పూర్వవైభవం తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఆకర్షిస్తున్న మ్యూజియం..
శతబ్దాల కాలం నుంచి ఇటీవల వరకు లభించిన అరుదైన శిల్పాలు, కళాఖండాలను భద్రపర్చి పర్యాటకులు చూసేందుకు వీలుగా పిల్లలమర్రి దగ్గర మ్యూజియం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హిందూ, బౌద్ద, జైన మతాల చరిత్రకు అద్దం పట్టే అనేకమైన వస్తువులు ఈ మ్యూజియంలో భద్రపరిచారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగరం కాలం వరకు రూపుదిద్దుకున్న ఎన్నో శిల్పాలు ఇక్కడ పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. పిల్లలమర్రి అందరికీ అందుబాటులో ఉన్న మహావృక్షంమే కాదు.. అహ్లాదకరమైన వాతావారణంతోపాటు అరుదై న పక్షలు, పాములు, జింకలు, తదితర జంతువులతో ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంగా మారింది.
వెంటిలేటర్‌పై మహావృక్షం..
శతాబ్దాల పాటు పర్యాటకులను ఎంతోగానో ఆకట్టుకున్న పిల్లలమర్రి ఒక్కసారిగా చెదల బారిన పడింది. రెండు ప్రధాన ఊడ లు ఊడిపోయే దశకు చేరుకున్నాయి. దీం తో ఈ మహావృక్షం పూర్తిగా అంతరించిపోతుందేమోనని పిల్లలమర్రి ప్రేమికులు ఆం దోళన చెందారు. ప్రధాన ఊడను ఇప్పటివరకు గుర్తించకపోవడంతో అధికారులు చికిత్స అందించలేకపోయారు. అధికార యంత్రాంగం, అటవీ అధికారులు స్పం దించి సంరక్షణ చర్యలు చేపట్టారు. మర్రి చెట్టు ప్రధాన కొమ్మలకు దిమ్మెలను ఏర్పా టుచేశారు. చెదలు పట్టిన కొమ్మలకు స్లున బాటిళ్లలో రసాయనాలను అందించి చికి త్స అందించారు.
ఊడల పాదుల దగ్గర సేంద్రియ మట్టిని నింపారు. చెట్టు నుంచి 55 ఊడలను ఒక్కొక్క పైపులోకి వచ్చేలా చేసి ఆ పైపు నిండా ఎర్రమట్టిని నింపారు. దానిలోనే రసాయనాలను నింపి ప్రతి ఊడకు జీవం పోశారు. చికిత్సలు ఫలించడంతో ఊడలు భూమిలోకి చేరడంతో ఆ మహావృక్షం పచ్చని పందిరిలా మారింది. చికిత్స అందిస్తున్న టైంలో దాదాపు నాలుగేండ్లుగా పర్యాటకులను అనుమతించలే దు. కేవలం ర్యాంపు ఏర్పా టు చేసి దూరం నుంచి చూసేలా ఏర్పాట్లు చేశారు.
చాలా బాగుటుంది..
పిల్లలమర్రి మహావృక్షం ఒక అద్భు తం. అక్కడికి వెళ్లి చూస్తేనే ఆ అద్భుతం అందరికీ దర్శనమిస్తుంది. మొన్నటి వర కు చెట్టును చూసేందుకు అనుమతి లేద ని, దూరంగా ఉండి చూడాలని చెప్పిండ్రు. ఇటీవల పిల్లలమర్రిని తిరిగి ప్రారంభించడంతో పర్యాటకుల మనస్సు హత్తుకు నేలా ఉందని తెలిసింది. మహబూబ్‌నగర్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకు వచ్చింది పిల్లలమర్రి. మహబూబ్‌నగర్ అంటే పిల్లలమర్రి అనేలా దేశంతోపాటు ఇతర దేశాల్లోను ప్రత్యేక గుర్తిం పును తీసుకురావడం జరిగింది.
కొండన్న, మహబూబ్‌నగర్
చిన్నప్పటి నుంచి వస్తున్నాను..
ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతమైన వాతావారణం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకువచ్చేవారు. అప్పటి నుంచి పిల్లలమర్రి చాలా ఇష్టంగా మారిం ది. అప్పటి నుం చి పిల్లల మర్రిని చూస్తున్నాను. పాలమూరుకు పిల్లలమర్రి ఒక వరం. మరింతగా అభివృద్ధి చేస్తే అత్యధికంగా జనం వెళ్లే అవ కాశం ఉంటుంది. అంత పెద్ద మహావృక్ష్యాన్ని కంటికి రెప్పాలా కాపాడుకుం టూ ముందుకు సాగాలి. ఇది ఒక మహా అద్భుతం.
మహిముద్, మహబూబ్‌నగర్






