2 June, 2026 | 2:24 AM

టెస్టుల్లో రెడ్‌బాల్‌కు బదులు పింక్‌బాల్

02-06-2026 01:33 AM
  1. వన్డేల్లో గ్రౌండ్‌లోకి హెడ్ కోచ్‌లు
  2. కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్ 
  3. ఐసీసీ కీలక నిర్ణయాలు

అహ్మదాబాద్, జూన్ 1 : అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అహ్మదాబాద్  వేదికగా ఐసీసీ ఛైర్మన్ జైషా నేతృత్వంలో రెండు రోజు ల పాటు సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో పలు కీలక అంశాలు చర్చించిన సభ్యు లు వాటికి ఆమోదం తెలిపారు. ఊహించినట్టుగానే టెస్ట్ ఫార్మాట్‌లో రెడ్‌బాల్‌కు బదు లుగా పింక్‌బాల్‌ను ఉపయోగించేందుకు ఐసీసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఆటలో వెలుతురు సమస్య కారణంగా ఆట నిలిచిపో కుం డా ఉండేందుకు, సంప్రదాయ రెడ్ బాల్‌కు బదులుగా అవసరమైతే పింక్ బాల్ వినియోగాన్ని ట్రయల్‌గా అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. ముందుగా ఇరు జట్ల అంగీకారంతో, వెలుతురు లేమి కారణంగా ఆట ఆగే పరిస్థితులు ఉంటే రెడ్‌బాల్ స్థానం లో పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్ర యల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. టెస్టు క్రికెట్‌లో వెలుతురు తగ్గడం వల్ల ఆట తరచూ నిలిచిపోతుండటాన్ని తగ్గించడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశ్యం.

పింక్ బాల్ సా ధారణంగా డే-నైట్ టెస్టుల్లో ఉపయోగిస్తారు. తక్కువ వెలుతురులో మెరుగైన కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే వెలుతురు లేమి సమస్య తలెత్తినప్పుడు ఈ బం తిని ఉపయోగించి మ్యాచ్‌ను కొనసాగించనున్నారు. ఇదిలా ఉంటే సందేహాస్పద బౌ లింగ్ యాక్షన్ రిపోర్ట్ చేసే సందర్భంలో మ్యాచ్ అధికారులు ఇకపై హాక్-ఐ డేటాను ఉపయోగించేందుకు ఐసీసీ అనుమతి ఇ చ్చింది.

అలాగే వన్డేల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్‌లు మైదానంలోకి వెళ్లి ఆటగా ళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. మరోవైపు లెగ్ సైడ్ వైడ్‌కు సంబంధించి సవరించిన నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కెనడా క్రికెట్‌ను సస్పెం డ్ చేయాలని ఐసీసీ బోర్డు తీర్మానించింది. సభ్యత్వానికి సంబంధించిన బాధ్యతలను ఉల్లంఘించడంతో తక్షణ సస్పెన్షన్‌కు కారణమని తెలుస్తోంది.