టిమ్ డేవిడ్‌పై ఒక మ్యాచ్ నిషేధం
అహ్మదాబాద్, జూన్ 1 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్ టిమ్ డేవి డ్ ప్రవర్తించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంపైర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఒక మ్యాచ్ నిషేధం విధిం చారు. అలాగే మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించడమే కాకుండా, రెండు డీమెరిట్ పాయింట్లను కూడా కేటాయించారు. ఈ వివాదాస్పద ఘటన మొదటి ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో చోటుచేసుకుంది.
ఒక వికెట్ పడిన తర్వాత తీవ్ర అసహనానికి లోనైన టిమ్ డేవిడ్ మైదానంలో ఉన్న అంపైర్ నితిన్ మీనన్ వైపు కోపంతో ఐస్ బ్యాగ్‌ను విసిరాడు. ఈ సీజన్‌లో టిమ్ డేవిడ్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడటం ఇది మూడోసారి. ఐపీఎల్ నిబంధనల ప్రకా రం ఐదు డీమెరిట్ పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027లో ఆర్‌సీబీ ఆడే మొదటి మ్యాచ్‌కు దూరం కానునాడు.






