21 August, 2026 | 4:33 PM

Breaking News

తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •   ఏఐవైఎఫ్ తాండూర్ మహాసభలను జయప్రదం చేయండి   •  

ఇస్నాపూర్‌లో పిన్నెల్లి అరెస్ట్?

23-05-2024 03:48 AM

ఏపీలో ఈవీఎంను ధ్వంసం చేశారన్న కేసు

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు

సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఎమ్మెల్యే ఉన్న ప్రాంతం గుర్తింపు

ఓ పరిశ్రమ గెస్ట్ హౌస్‌లో దాగిన పిన్నెల్లి 

అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు? 

కంది సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే వాహనాలు.. డ్రైవర్, అనుచరులు ఉన్నట్లు సమాచారం!

ఏపీ ఎమ్మెల్యే అరెస్టు తమకు తెలియదని సమాధానం ఇచ్చిన పటాన్‌చెరు, సంగారెడ్డి రూరల్ పోలీసులు 

సంగారెడ్డి, మే 22 (విజయ క్రాంతి) : ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సంగారెడ్డిలోని ఇస్నాపూర్ సమీపంలో  ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అరెస్టు చేసినట్లు తెలిసింది.  బుధవారం ఏపీకి చెందిన పోలీసులు సెల్‌ఫోన్ లొకేషన్‌తో పటాన్‌చెరు పోలీసు స్టేషన్ పరిధి లోని ఇస్నాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారని సమాచారం. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాచర్లలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారని ఎమ్మెల్యే పై అక్కడ కేసు నమోదైంది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామి రెడ్డిలను అరెస్టు చేయాలని ఎన్నికల కమీషనర్ అదేశాలు జారీ చేయడంతో, పోలీ సులు అరెస్టు చేస్తారనే భయంతో వారు తెలంగాణకు పారిపోయి వచ్చినట్టు సమాచారం.

ఏపీకి చెందిన పోలీసులు పటాన్ చెరు, సంగారెడ్డి పోలీసుల సహాయంతో సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఎమ్మెల్యే ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. కంది సమీపంలో ఎమ్మెల్యే కారు డ్రైవరుతో పాటు అనుచరులను అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్లు తెలిసింది. కంది సమీపంలో ఎమ్మెల్యే కారు ఉన్నా, అందులో ఎమ్మెల్యే లేకపోవడంతో సమీపంలోనే ఉన్నారనే పోలీసులు వెతికారు. ఇస్నాపూర్ సమీపంలో ఓ పరిశ్రమ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే ఉన్నట్లు గుర్తించి ఆయనను అరెస్టు చేశారని తెలిసింది. ఏపీ పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారని తెలిసింది.

ఎమ్మెల్యే పిన్నెల్లి కారులో సెల్‌ఫోన్ వదిలిపారిపోయారని మొదట పుకార్లు వచ్చాయి. కందిలో ఉన్న సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే వాహనంతో పాటు అనుచరుల వాహనాలు తీసుకువచ్చారు. ఏపీ పోలీసులు డ్రైవరును, అతని అనుచరులను విచారించగా ఇస్నాపూర్‌లో ఉన్నట్లు సమాచారం ఇచ్చారని తెలిసింది. ఈవీఎంలు ధ్వంసం చేసిన ఎమ్మెల్యేతో పాటు అనుచరులను అరెస్టు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పోలీసులను నియమించింది. ఇలా ఉండగా మాచర్ల ఎమ్మెల్యే అరెస్టుపై తమకు తెలియదని పటాన్‌చెరు, సంగారెడ్డి రూరల్ పోలీసులు చెప్పారు. 

పిన్నెల్లిపై ఈసీ సీరియస్..

సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే.. పిన్నెల్లి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగా ఆయనకు ఎన్నికల అధికారి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఈవీఎం ఉన్న ప్రాంతంలోకి వెళ్లి, వీవీ ప్యాట్‌ను తీసుకొని గట్టిగా నేలపై విసిరికొట్టాడు. అక్కడే ఉన్న పోలింగ్ ఏజెంట్ వారిని వారించే ప్రయత్నం చేయగా.. ఆయన్ను హెచ్చరిస్తూ బయటకు వెళ్లాడు. ఇదంతా సీసీటీవీలో స్పష్టంగా రికార్డుంది.

ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఘటనకు పాల్పడిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్‌ను ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలోనే తాజా అరెస్టు జరిగింది. కాగా, ఓటమి భయంతోనే వైసీపీ ఎమ్మెల్యే ఇలాంటి విధ్వంసానికి పాల్పడినట్టు ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. ఈనెల 13న ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు, 175 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఎన్నికల రోజున పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం..

అమరావతి: వీవీప్యాట్‌లను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో ఏడు సంఘటనలు జరిగాయని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి సిట్‌కు పోలీసులు అన్ని వివరానలు అందించారని చెప్పారు. 20న రెంటచింతల ఎస్‌ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని, మొదటి నిందితుడిగా పిన్నెల్లిని అందులో పేర్కొన్నారని తెలిపారు.

వెబ్‌కాస్టింగ్ ద్వారా అన్ని ఘటనలను పరిశీలించామని, ఈవీఎంలు ధ్వసం చేసినా డేటా మొత్తం భద్రంగా ఉందని, కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని వివరించారు. అన్ని చోట్ల కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటనలు జరిగిన మరుసటి రోజే పోలీసులకు ఆధారాలతో సహా వివరాలు అందించామని వివరించారు.