పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు
26-06-2024 04:17 PM
అమరావతి : వైఎస్సార్సీపీ నేత, మాచర్ల మాజీ ఎంఎల్ఎ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో పిన్నెల్లిని అరెస్టు పోలీసులు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుంచి మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి చేసిన ఘటన, ఎన్నికల అల్లర్ల కేసుల్లో ఏపీ హైకోర్టు పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇప్పటివరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుస్తు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు.






