గాంధీలో జూనియర్ డాక్టర్ల సమావేశం.. అంతర్గత చర్చలు
హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో కాకుండా తెలంగాణవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు బుధవారం నాడు చేపట్టిన నిరవధిక సమ్మెను తాత్కాలికంగా విరమించారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యుల సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కాలేజీల నుంచి వచ్చిన జూనియర్ వైద్యులు ప్రభుత్వంతో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది.
ప్రభుత్వంతో భేటీకి ముందు అంతర్గత చర్చలు జరుపుతున్నారు. ఉస్మానియా, గాంధీ జూనియర్ వైద్యులు వసతిగృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసిన సర్కారు, కాకతీయ వైద్య కళాశాలలో రహదారులు పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఉస్మానియా, గాంధీ కాకతీయ వర్సిటీలకు రూ. 204.85 కోట్లు, గాంధీ ఆసుపత్రికి రూ.79.50 కోట్లు, కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్లకు రూ.2.75 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.






