11 July, 2026 | 10:37 PM

ఎవరినైనా ఓడిస్తాం: పాంటింగ్

07-05-2024 12:27 AM

న్యూఢిల్లీ: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకోవడానికి ఏ జట్టునైనా ఓడించే శక్తి తమకు ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో పాంటింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం బలమైన రాజస్థాన్‌తో మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో పాంటింగ్ స్పందించాడు. ‘ తర్వాతి మ్యాచ్ పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్‌తో ఆడబోతున్నాం. అయితే 40 ఓవర్ల ఆటలో బెస్ట్ క్రికెట్ ఆడితే విజయం వెతుక్కుంటూ వస్తుంది. ఎవరితో ఆడుతున్నాం.. ఎక్కడ ఆడుతున్నాం అనేది ఇక్కడ అనవసరం. చివరి ఏడు గేముల్లో పంత్ అండ్ కో మంచి ప్రదర్శన కనబరిచింది. ప్లేఆఫ్స్‌కు చేరుతామన్న నమ్మకముంది’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.