11 July, 2026 | 9:34 PM

ఢిల్లీ x రాజస్థాన్

07-05-2024 12:32 AM

టీమిండియా వికెట్ కీపర్ల మధ్య ఆసక్తికర పోరు

న్యూఢిల్లీ: ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతున్న సమయంలో మంగళవారం హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ అమితుమీ తేల్చుకోనుంది. ఢిల్లీ ఆడిన 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది. పాయింట్ల పరంగా టాప్ ఉన్న రాజస్థాన్‌ను సొంతగడ్డపై ఓడించి ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ఢిల్లీ భావిస్తోంది. రాజస్థాన్‌పై విజయం సాధిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరోవైపు ప్లేఆఫ్ చేరేందుకు రాజస్థాన్‌కు ఒక్క విజయం అవసరముంది. ఢిల్లీతో మ్యాచ్‌తో ఆ పనిని పూర్తి చేయాలని అనుకుంటోంది. ఢిల్లీ బ్యాటింగ్ మొత్తం జేమ్స్ మెక్‌గుర్క్, కెప్టెన్ పంత్‌పైనే ఆధారపడి ఉంది. ఈ ఇద్దరు మినహా మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ఫామ్‌లో లేరు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ రాణించాల్సిన అవసరముంది. రాజస్థాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే టాప్ బట్లర్, జైస్వాల్, శాంసన్‌లు భీకరఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. మిడిలార్డర్‌లో రియాన్ పరాగ్ హిట్టింగ్‌తో మెరుస్తున్నాడు. ధ్రువ్ జురేల్, హెట్‌మైర్, పావెల్ రూపంలో ఫినిషర్లు ఉన్నారు. అయితే టాపార్డర్ విఫలమైతే మాత్రం రాయల్స్ పరుగులు చేయడంలో విఫలమవుతోంది.