13 April, 2026 | 4:18 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

సనత్‌నగర్‌లో పిక్సెల్ ఐ హాస్పిటల్ ఘన ప్రారంభం

25-10-2025 08:20 PM

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్..

సనత్‌నగర్ (విజయక్రాంతి): సనత్ నగర్ లో పిక్సెల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ కృష్ణ పూజిత, డాక్టర్ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పిక్సెల్ ఐ హాస్పిటల్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. పిక్సెల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్స్ ఎమ్మెల్యే తలసానికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సనత్ నగర్ లో మెయిన్ రోడ్ లో ఐ హాస్పిటల్ ప్రజలకు దగ్గరగా ఉండటం చాలా సంతోషించదగ్గ విషయమని ప్రతి మనిషికి కంటి చూపు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని కంటి చూపు సరిగ్గా లేనిపక్షంలో వెంటనే కంటి ఆస్పత్రికి వెళ్లి వెంటనే పరీక్షలు చేయించుకుని కంటి శుభ్రతను పాటించాలని తగిన మందులు తీసుకోవాలని సూచించారు. పిక్సెల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీర్జా ఖలీల్ బేగ్, కొలను భూపాల్ రెడ్డి, సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, షఫీ, రాజేష్ ముదిరాజ్ ,జమీర్ బేగ్, నమాన్ ఉద్దీన్ , పురుషోత్తం, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.