25-10-2025 08:25:04 PM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్
బచ్చన్నపేట,(విజయక్రాంతి): బండనాగరం గ్రామానికి చెందిన రాపెల్లి కమల, భర్త, వెంకటనారాయణ మోకాళ్ళ మార్పిడి సమస్యతో బాధపడుతుండగా, బచ్ఛన్నపేట మండల అధ్యక్షుడు నూకలబాల్ రెడ్డి, బండనాగరం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ వెంటనే బీసీ సంక్షేమ, రవాణ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి లక్ష యాబై వేల రూపాయల (1,50,000) ఎల్ఓసి, మంజూరు చేయించారు. మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి నాగపురి కిరణ్ కుమార్ అందజేశారు