19 July, 2026 | 2:49 AM

సవాళ్లను ఎదుర్కొనేలా ప్రణాళికలు

19-07-2026 12:47 AM
  1. విద్యుత్ డిమాండ్‌పై అప్రమత్తంగా ఉండాలి
  2. డిస్కంలకు గృహజ్యోతి ఊరట
  3. విద్యుత్ పంపిణీలో ఏఐ 
  4. కొత్త బొగ్గు బ్లాక్‌ల సాధనలో గత ప్రభుత్వానిది ఘోర వైఫల్యం
  5. కోయగూడెం సత్తుపల్లి2 బ్లాక్లను సింగరేణి దక్కించుకోవాలి
  6. విద్యుత్ శాఖ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున, భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ శాఖ సమీ క్షా సమావేశంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధానంగా ప్రజల తాగునీటి అవసరాలకు, రైతుల వ్యవసాయ సాగు కు ఎటువంటి ఆటంకం కలగకుండా అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందిం చడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన వి ద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని, రెవెన్యూ వసూళ్ల ప్రక్రియను వేగవం తం చేసి సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను పెం పొందించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ వినియోగదారుడికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు సాగాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో అభివృద్ధి చేసిన మోడల్ సబ్ స్టేషన్‌ను ఆదర్శంగా తీసుకుని, టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లను దశలవారీగా ఆధునికరించాలని కోరారు. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో భూమి కొరత దృష్ట్యా ఫ్లైఓవర్ల కింద సబ్ స్టేషన్లు ఏర్పాటుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

108 తరహాలో ప్రారంభించిన ’పవర్ అంబులెన్స్’ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఆదేశించారు. డీటీఆర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయా లని, ఏఐ ఆధారిత సాంకేతికతను విద్యుత్ శాఖలో విస్తృతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల అమలును నిరం తరం పర్యవేక్షించాలని ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు. 

సింగరేణి కొత్త బ్లాక్‌లను సాధించాలి

తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాక్లను సాధించి, తన ఉత్పత్తి సా మర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని భట్టి పేర్కొన్నారు. ఇటీవల మైనింగ్ లీజు లభించిన తాడిచర్ల బ్లాక్‌కు సంబంధించి నిర్ణీత కాలపరిమితిలో అన్ని అనుమతులు సాధించి, యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో అవసరమైన కొత్త బొగ్గు బ్లాక్లను సాధించేందుకు ప్రయత్నించకపోవడం వల్ల ప్రస్తుతం అదనపు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త గనుల సాధనలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాని ప్రభావం ప్రస్తుతం సింగరేణిపై పడుతోందని ఆయన అన్నారు. అయినప్పటికీ, ఈ పరిస్థితిని ఒక సవాల్‌గా స్వీకరించి, రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా, సకాలంలో సరఫరా చేసేలా సమగ్ర కార్యాచరణను అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతున్నందున బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, డిస్పాచ్ అంశా లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఇప్పటికే ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని, అలా గే తెలంగాణలో తాడిచర్ల2 బ్లాక్‌కు మైనింగ్ లీజు కూడా లభించిందని తెలిపారు. ఇదే సమయంలో గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో సింగరేణికి దక్కకుండా పోయిన కోయగూడెం సత్తుపల్లి బ్లాక్లు తిరిగి సింగరేణికే దక్కాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని సింగ రేణి అధికారులను ఆదేశించారు.