29-07-2025 12:59:14 AM
నిర్మల్, జూలై 28 (విజయక్రాంతి): ప్రతి విద్యార్థి పాఠశాలలో ఇండ్లలో మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతలను తీసుకోవాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీనాయక్ అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని రామ్ నగర్ ఆశ్రమ బాలికల పాఠశాలలో మొక్కలు నాటారు.
ఐటీడీఏ పరిధిలో అన్ని ఆశ్రమ గిరిజన పాఠశాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరు గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశా ల ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.