11 April, 2026 | 3:34 AM

వైశాఖి వేడుకలకు ముఖ్య అతిథిగా రండి

11-04-2026 01:33 AM
  1. గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలి
  2. కేటీఆర్‌కు అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ ఆహ్వానం

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాం తి): అమీర్‌పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఘనంగా నిర్వహించ నున్న ఖల్సా సాజన దివస్ -‘వైశాఖి’ వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్‌ను గురుద్వారా ప్రతినిధులు ఆహ్వానించారు. అమీర్‌పేట్ గురుద్వారా కమిటీ ప్రెసి డెంట్ ఎస్ దర్శన్‌సింగ్ ఆధ్వర్యంలోని బృం దం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసింది.

ఈ సందర్భంగా 14న అమీర్‌పేట్‌లోని గురు గోవింద్ సింగ్జీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరు కావాలని కోరారు. పంజాబ్ నుంచి వచ్చిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని, ఈ వేడుకల కు సుమారు 8,500 మంది హాజరవుతారని ప్రతినిధులు వివరించారు. ఈ పండుగ లో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని వారు కేటీఆర్‌ను కోరారు.