18 April, 2026 | 2:58 PM

వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి

18-04-2026 01:57 PM

ఆదిలాబాద్ డీఎఫ్ఓ ను కలిసిన వడ్రంగులు.. 

బోథ్ ,(విజయక్రాంతి): బోథ్ మండలం కేంద్రంలో కలపని నమ్ముకుని జీవిస్తున్న తమకు వర్క్ షాప్ పర్మిషన్ ఇవ్వాలని మండల కేంద్రానికి చెందిన వడ్రంగులు శనివారం ఆదిలాబాద్ డీఎఫ్ఓకు విన్నవించారు. తాము దశాబ్దరకాలంగా వడ్రంగి పనిని వృత్తిగా చేస్తూ కుటుంబాలని పోషించుకుంటున్నామని వారు డిఎఫ్ఓకు విన్నవించారు. మండల కేంద్రంలో వర్క్ షాప్ అనుమతి లేదని ఇంటి వద్ద ఫర్నిచర్ చేయరాదని అధికారులు చేరుకుంటున్నారని వారు డీఎఫ్ఓ కు విన్నవించారు. పనిచేసే నైపుణ్యం ఉన్న అనుమతులు లేకపోవడం వల్ల వడ్రంగి పని చేసుకోలేకపోతున్నామని వారు వాపోయారు. వడ్రంగుల సమస్యను విన్న డీఎఫ్ఓ ఈ విషయమై పిసిసిఎఫ్ దృష్టికి తీసుకువచ్చి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వడ్రంగులు తెలిపారు. కార్యక్రమంలో వడ్రంగులు పాలికి రమేష్, అల్లిశంకర్ ,ఉప్పుల దాసు  సౌరాల రూపేష్, గట్టు వేణు, కొండనాగుల ప్రసాద్, ఉన్నారు