2041 నాటికి సరికొత్త నోయిడా
4 దశల్లో అభివృద్ధికి యూపీ సర్కారు ఆమోదం
లక్నో, డిసెంబర్ 2: అత్యాధునిక సౌకర్యాలతో సరికొత్త నోయిడాను నిర్మించే ప్రణాళికకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమో దం తెలిపింది. దాద్రీ, బులందర్‌షహర్ ప్రాంతాల్లోని 84 గ్రామాలను కలుపుతూ ఈ ఫ్యూచర్ సిటీని దేశంలోనే అ త్యంత ఆధునిక, సాంకేతికంగా అభివృద్ధి చెందిన నగరంగా నిలుస్తుందని ప్రభు త్వం పేర్కొంది. ఈ నగరాన్ని ౪ దశల్లో అభివృద్ధి చేసి 2041 నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని భావిస్తోంది.
ఈ ప్లాన్‌కు నోయిడా అథారిటీ బోర్డు గతేడాది ఆగస్ట్‌లో ఆమోదం తెలిపి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. నూతన నగరంలో సోలార్ ఎనర్జీతో కూడిన పర్యావరణ హిత భవనాలు నిర్మించడంతోపాటు స్మార్ట్ ట్రాఫి క్ సిగ్నళ్లను, రియల్ టైం మానిటరింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. ఈ సిటీ ఉద్యోగావకాశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.






