22 April, 2026 | 5:27 PM

పొదుపు సంఘాల మహిళలను సంపన్నులుగా చేయండి

22-04-2026 04:18 PM

బోథ్,(విజయక్రాంతి): గ్రామాలలో ఉన్న పొదుపు సంఘాల మహిళలను సంపన్నలుగా తీర్చిదిద్దే బాధ్యత అందరిపై ఉందని అందులో ఇందిర క్రాంతి పథకంలో పనిచేసే సిబ్బందిది ప్రధాన పాత్ర ఉంటుందని టీపీఎం బోథ్ మండల ప్రత్యేక అధికారి అయిన సాయి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఇందిర క్రాంతి కార్యాలయంలో అన్ని గ్రామాల మహిళా సమాఖ్య అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డిపిఎం మాట్లాడుతూ... మహిళల ఆర్థిక ఎదుగుదలకు ఇందిరా క్రాంతి పథకంలో పని చేస్తున్న సీసీలు ప్రత్యేక దృష్టి సారించి చిన్నచితక వ్యాపారాలు చేసే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం మహిళా సమాఖ్య కార్యాలయాలకు మండలానికి ఒకటి చొప్పున బస్సులను మంజూరు చేయడం జరిగిందని వివరించారు .బోథ్ మహిళా సమాఖ్య కూడా బస్సు మంజూర అయిందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం గణేష్ సీసీలు బి గంగాధర్ ఎం గంగాధర్ భాస్కర్ పోసాని సుభద్ర , ౌసల్య బ్యాంకు మిత్ర విజయలక్ష్మి ,కంప్యూటర్ ఆపరేటర్ అశోక్ తో పాటు మహిళా సమాఖ్య అధ్యక్షులు వసంత కార్యదర్శి శోభ ట్రెజరర్ సమంతా బాయి లు పాల్గొన్నారు,