13-08-2025 08:03:14 PM
ఎస్సై రామకృష్ణ..
నాగల్ గిద్ద: మండల పరిధిలోని కరసవ్యక్తి గిరిజన గురుకుల పాఠశాల(Tribal Gurukul School)లో పోలీసు కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై రామకృష్ణ, మండల ఎంపీడీవో మహేశ్వరరావు, తాసిల్దార్ శివకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, డ్రగ్స్ వాడకంలో కలిగే శారీరక మానసిక నష్టాలు వివరించారు. చిన్నవయసులోనే మత్తు పదార్థాలు అలవాటు పడడంతో భవిష్యత్తు చెడగొడుతుందని, అటువంటి పరిస్థితులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులచే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.