calender_icon.png 14 August, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించాలి

14-08-2025 08:34:30 AM

మునగాల, (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు  వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని డిప్యూటీ డిఏహెచ్ఓ జయ మనోహరి  అన్నారు.  మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఇద్దరికీ డెంగ్యూ వ్యాధి బారిన పడిన సంఘటనలో భాగంగా బుధవారం జిల్లా డిప్యూటీ డిఎన్హెచ్ఓ కలకోవ గ్రామాన్ని సందర్శించి  డెంగ్యూ వ్యాధి వ్యాప్తి నివారణకు తగు చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు  సురేందర్, రేపాల ప్రాథమిక కేంద్రం వైద్యులు  వినయ్ కుమార్ ఏఎన్ఎంలు నాగమణి, నరసమ్మ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.