calender_icon.png 14 August, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలనేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

14-08-2025 10:14:58 AM

-మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్. 

గుండాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు(heavy rains) కురుస్తున్న నేపథ్యంలో గుండాల మండల ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విపత్కరపరిస్థితుల్లోఅనుసరించాల్సిన కార్యాచరణ, తీసుకోవలసిన ముందు జాగ్రత్తలపై విద్యుత్, వైద్య శాఖల అధికారులతో చర్చించారు. మండల అధికారుల బృందం మండలంలో పర్యటించి ఆయా గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే సమాచారం అందించాలని మండల ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి దేవేందర్ రావు, ఎంపీఓ సలీం, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, జాతీయ ఉపాధి హామీ అధికారులు,  ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.