14-08-2025 09:47:16 AM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు(Rains) తో భూమి పదునెక్కిన విషయం విధితమే. ఈ తరుణంలో నాసిరకం పనులను కూడా ఈ భారీ వర్షాలు వెలుగులోకి తీసుకొస్తున్నాయి. రైల్వే పనులు అంటేనే కేంద్రం పరిధిలో ఉంటాయి నాణ్యతకు మారుపేరు అంటారు. రాగా ఇక్కడ అలా జరగలేదు ఎందుకో ఉందా నగర్ నుంచి మహబూబ్ నగర్ వరకు రైల్వే డబల్ నైన్ నిర్మించారు. ఈ లైన్ కూడా ప్రారంభం కావడంతో పాటు రైళ్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని అప్పనపల్లి నుంచి ఎదిర మార్గంలో రైల్వే అధికారులు ఆర్ఓబి ని నిర్మించారు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ధాటికి అప్పనపల్లి దగ్గర ఉన్న రైల్వే ఆర్ఓబి సైడ్ వాల్ ఒక్కసారిగా అర్ధరాత్రి కూలిపోయింది.
అర్ధరాత్రి ఆర్ఓబి బ్రిడ్జి దగ్గర పక్కకే ఉన్న సైడ్ వాల్ (ప్రహరి) ఒక్కసారిగా కూలీ రోడ్డుపై వాహనాలు వెళ్లే మార్గంలో పడిపోయింది. దీంతో అప్పనపల్లి నుంచి ఎదిర వెళ్లేందుకు రాకపోకలు బంద్ కావడం జరిగింది. నాసిరకం పనుల ద్వారానే ఇలా జరిగిందని వాహనాలు రాకపోకల సమయంలో ఇలా జరిగి ఉంటే ప్రాణాలు పోయేవని అప్పనపల్లి, ఎదిర గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే నిర్మాణ పనులు కూడా నాసిరకం పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలో ఎక్కడైనా అధికారుల పర్యవేక్షణ పక్కాగా ఉండి నాణ్యతగా చేయించాలని ప్రజలు కోరుతున్నారు. మహబూబ్ నగర్ నుంచి ఎదిర, దివిటిపల్లి, దివిటిపల్లి డబల్ బెడ్ రూమ్, ఐటీ పార్క్ సిద్దయ్యపల్లి, ఎన్ హెచ్ 44 ప్రాంతాలకు వెళ్లేవారు ఏనుగొండ, బైపాస్ రోడ్డు ల నుంచి వాహన చోదకులు తమ ప్రయాణాలను కొనసాగించాలి.