calender_icon.png 14 August, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ వద్ద కనువిందు చేస్తున్న కృష్ణమ్మ

14-08-2025 09:11:30 AM

  1. సాగర్ వద్ద కనువిందు చేస్తున్న కృష్ణమ్మ 
  2. భారీ వర్షాలతో కృష్ణానదికి పోటెత్తుతున్న వరద
  3. నాగార్జున సాగర్ ఔట్ ఫ్లో 2,73,117 క్యూసెక్కులు
  4. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 589.30

నాగార్జునసాగర్,విజయక్రాంతి: నాగార్జున సాగర్‌ జలాశయం(Nagarjuna Sagar Reservoir) నుంచి క్రస్ట్‌ గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. బిరా బిరా మంటూ పరిగెడుతూ కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సందడి చేస్తోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి కిందకు అందంగా కృష్ణమ్మ పరవళ్లు పెడుతుండడాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. నాగార్జున సాగర్‌ 26 గేట్ల నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు కనులారా తిలకిస్తున్నారు. పాలనురగలా స్పీల్‌ వే గుండా కృష్ణమ్మ పరవళ్లు తోక్కుతోంది.

సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జలసోయగాలు వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో నాగార్జున సాగర్ జళకళను సంతరించుకుంది. నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చెరువులు, కుంటలు వరదలతో నిండిపోయాయి. దీంతో దుగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఉదృతంగా కొనసాగుతోంది. ఇక, భారీ వర్షాలతో నాగార్జునసాగర్ జలాశయంలోకి పెద్ద ఎత్తు వరద నీరు వచ్చే చేరుతుంది. దీంతో సాగార్ డ్యామ్ నిండుకుండలా మారింది. ఈక్రమంలో అధికారులు జలాశయం 26 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,28,601 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో 2,73,117 క్యూసెక్కులుగా ఉంది. ఇక, డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సాగర్ వద్ద కనువిందు చేస్తున్న కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సాగర్ కు తరలివస్తున్నారు. క్రస్ట్ గేట్ల మీదుగా జాలువారుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు పర్యాటకుల తాకిడి ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు సాగర్ కు వస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్ళును చూసేందుకు టూరిస్టులు నాగార్జున సాగర్ కు క్యూ కడుతున్నారు. నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేస్తున్నారు. క్రస్ట్ గేట్ల మీదుగా పాల నూరుగువలే జాలువారుతున్న కృష్ణమ్మ సోయగాలను పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగుతూ పర్యాటకులు సందడి చేస్తున్నారు.