5 June, 2026 | 6:04 PM

మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ

05-06-2026 04:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొక్కల సంరక్షణపై శుక్రవారం ప్రతిజ్ఞ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బొప్పుడే జిల్లా అధికారులు సిబ్బంది మొక్కల సంరక్షణపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఆ మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు.