11-12-2025 01:26:28 PM
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) అల్పాహార విందు ఇచ్చారు. సుమారు అరగంట పాటు 15 మంది ఎంపీలతో మోదీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుతో కలిసి ముందుకు వెళ్లడం మంచి పరిణామం, పూర్తి సమన్వయంతో వెళుతున్నట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిపాలనపై కూడా మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ ఎంపీలపై(Telangana BJP MPs) ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ తక్కువగా ఉందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షపాత్ర కూడా పోషించట్లేదని ఫైర్ అయ్యారు. మంచి టీమ్ ఉన్నా ఎక్కడ సమస్య వస్తోందని ప్రధాని మోదీ ఎంపీలను ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు మంచి అవకాశముందని సూచించారు. మంచి అవకాశం వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారని ఆక్షింతలు వేశారు.