calender_icon.png 11 December, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో రాష్ట్రపతి పర్యటన

11-12-2025 02:00:41 PM

ఇంఫాల్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) గురువారం మధ్యాహ్నం ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించారని అధికారులు తెలిపారు. భారత రాష్ట్రపతి అయిన తర్వాత ఈశాన్య రాష్ట్రానికి ఆమె రావడం ఇదే తొలిసారి. మే 2023లో జాతి హింస చెలరేగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సెప్టెంబర్ 13న తొలిసారిగా ఆ రాష్ట్రాన్ని సందర్శించిన సుమారు మూడు నెలల తర్వాత ఆమె పర్యటన జరుగుతోంది. రాష్ట్రపతి భారత వైమానిక దళ విమానంలో ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్ భవన్‌కు ఆమె రోడ్డు మార్గంలో చేరుకున్నారని ఒక అధికారి తెలిపారు. ఆమె ప్రయాణించే మార్గంలో సాయుధ బలగాలు మోహరించి భద్రత కల్పించాయని ఆయన పేర్కొన్నారు.