01-01-2026 11:21:37 AM
ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: 2026 సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year wishes) తెలిపారు. నూతన సంకల్పంతో ఈ సంవత్సరాన్ని స్వాగతించాలని దేశ పౌరులకు పిలుపునిచ్చారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఇలా రాశారు. మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొత్త ఆశలు, కొత్త సంకల్పాలు, కొత్త ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. జీవితంలో ముందుకు సాగడానికి ఇది ప్రతి ఒక్కరినీ ప్రేరేపించాలని ఆశిస్తున్నాము. రాబోయే సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును తీసుకువస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ప్రయత్నాలలో విజయం లభించాలని, మీరు చేసే పనులన్నింటిలోనూ సంతృప్తి కలగాలని తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, సమాజంలో శాంతి, సంతోషం నెలకొనాలని ప్రార్థించారు.