calender_icon.png 29 August, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ అభివృద్ధిలో జపాన్ కీలక పాత్ర: ప్రధాని మోదీ

29-08-2025 02:45:07 PM

ఇండియా-జపాన్ ఎకనామికల్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో(India-Japan Economic Forum) ప్రధాని పాల్గొన్నారు. భారత్ ప్రతిభ, జపాన్ సాంకేతిక కలిసి పనిచేస్తే సాంకేతిక విప్లవం తప్పదని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని మోదీ తెలిపారు. ఏఐ,సెమీకండెక్టర్, క్వాంటం కంప్యూటరింగ్ , బయోటెక్, అంతరిక్ష రంగాల్లో కలిసి పనిచేద్దామని మోదీ పిలుపునిచ్చారు. సాహసోపేతమైన, ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకుందన్నారు. జపాన్ సాంకేతికత, భారత్ ప్రతిభ కలిసి పనిచేస్తే.. 2030 వరకు 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి , 2047 కల్లా 100 గిగావాట్ల అణువిద్యుత్ సాధ్య మన్నారు. సోలార్ సెల్స్ అయినా.. గ్రీన్ హైడ్రోజన్ అయినా భాగస్వామ్యం కోసం అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. స్వచ్ఛ ఇంధనం, పర్యావరణ అనుకూల భవిష్యత్తుపై సహకారం కోసం జాయింట్ క్రెడిట్ మెకానిజంపై భారత్- జపాన్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయని చెప్పారు.