calender_icon.png 29 August, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

257 మంది కార్మికులు.. 200 మంది పోలీసులు

29-08-2025 01:58:06 PM

ఆసక్తికరంగా దేవాపూర్ ఓరియంట్ కంపెనీ ఎన్నికలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ(Devapur Orient Cement Company) ఎన్నికల్లో శుక్రవారం  257 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోగా 2 వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులతోపాటు, రామగుండం కమిషనరేట్ నుండి కూడా పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు వినియోగించారు. కార్మికులకు సమానంగా కంపెనీలో పోలీసులు బందోబస్తు నిర్వహించడం పట్ల పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.