29-08-2025 01:55:02 PM
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జాబితా నుంచి మూడు వర్గాలను తొలగించాలన్న పిటిషన్ పై సుప్రీం కోర్టులో(Supreme Court) శుక్రవారం నాడు విచారణ జరిగింది. లంబాడా, సుగాలి, బంజారాను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖాలైంది. మూడు వర్గాలు ఎస్టీ జాబితాలో కొనసాగించాల్సిన అవసరం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 3 వర్గాలను కొనసాగించాల్సిన అవసరం లేదని తెల్లం వెంకట్రావు(Tellam Venkata Rao) పిటిషన్ వేశారు. లంబాడా, సుగాలి, బంజారా వారు బీసీ జాబితాకు చెందిన వారని పిటిషన్ లో తెలిపారు. విభజనకు ముందు పరిస్థితులు వేరని పిటిషన్ లో తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. 1976 వరకు మూడు వర్గాలను ఎస్టీల జాబితాలో పరిగణించలేదని వెంకట్రావు సూచించారు. జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ల ధర్మాసనం పిటిషన్ పై విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.