calender_icon.png 12 July, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో వాదనలు పూర్తి

07-08-2024 01:55:38 PM

హైదరాబాద్‌ : పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టులో బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్వీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఫిర్యాదును స్వీకర్ స్వీకరించలేదంటూ బీఆర్ఎస్ నేతలు కౌశిశ్ రెడ్డి, వివేకానంద్ కోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సిఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. స్వీకర్ నిర్ణయం తీసుకునేలా కోర్టులు ఆదేశించే అధికారం లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.