22 July, 2026 | 3:17 AM

వెంకయ్య చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని

30-06-2024 12:57 PM

న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవానికి ముందు ఆయన జీవితం, ప్రయాణాన్ని వివరించే మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విడుదల చేశారు. వర్చువల్ ఈవెంట్ సందర్భంగా, ప్రధాని మోడీ వెంకయ్య నాయుడు జీవితంలోని అసాధారణ విజయాలు, మైలురాళ్లను హైలైట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.... వెంకయ్య నాయుడు జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని ప్రధాని తెలిపారు. వెంకయ్య నాయుడుతో సుదీర్ఘకాలం పరిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. వేలాది కార్యకర్తలు వెంకయ్య నుంచి ఎంతో నేర్చుకున్నారని మోడీ అన్నారు. అత్యయిక పరిస్థితి వేల వెంక్య నాయుడు పోరాడారని గుర్తుచేసుకున్నారు. అత్యయిక పరిస్థితి సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిశాఖలో తనదైన ముద్రవేశారని తెలిపారు. స్వచ్ఛ భారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారని చెప్పారు. వెంకయ్య నాయుడు చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేదరని మోడీ తెలిపారు.