22 July, 2026 | 2:39 AM

వెంకయ్య సేవలను దేశం మరవదు: మోడీ

30-06-2024 01:05 PM

న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవానికి ముందు ఆయన జీవితం, ప్రయాణాన్ని వివరించే మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం విడుదల చేశారు. వర్చువల్ ఈవెంట్ సందర్భంగా పీఎం మాట్లాడుతూ... రాజ్యసభ ఛైర్మన్ గా సభను సజావుగా నడిపారని మోడీ తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ గా వెంకయ్య సేవలను దేశం మరవదన్నారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు వచ్చిందన్న ప్రధాని ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదంలో వెంకయ్య పాత్ర కీలకం అన్నారు. రాజ్యసభ నిర్వహణలో వెంకయ్య అనుభవం ఉపయోగపడిందని ప్రధాని పేర్కొన్నారు. దీర్ఘకాలం వెంకయ్య నాయుడు ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని కోరారు.